దేవరకొండ రూరల్, జులై 09 : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కొల్లిముంతల్ పహాడ్‌కి చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ టోర్నమెంట్లో కళాశాలకు చెందిన ఆకాశ్, గణేశ్, అఖిల్, చందు, శ్రీకాంత్ ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపియ్యారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. విద్యార్థుల ఎంపికపై కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సాగర్, ఏటీపీ సంజీవయ్య, డీడబ్ల్యూ ఎల్లప్ప, రగ్బీ కోచ్ దాసరి పృథ్వి రాజ్, పీడీ నాగేంద్ర బాబు, పీఈటీ రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.