మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెంది న ఇంద్రసేనారెడ్డికి రూ.98 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉదా రంగా వ్యవహరిస్తూ అనారోగ్యంతో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ, మాజీ మార్కెట్ కమిటీ చైరన్లు చింతరెడ్డి శ్రీని వాస్రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, నాయకులు జగదీశ్, రవీందర్, గడగోజు ఏడుకొండల్ తదితరులు పాల్గొన్నారు.