నేరేడుచర్ల, జనవరి 26 : సాగర్ జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున నీటి విడుదల చేసే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడకపోవడంతో గతంలో ఎన్నడూ లేని విదంగా సాగర్ డ్యామ్‌లో నీటి సామర్థ్యం చాలా తక్కువుగా ఉందన్నారు. అనంతరం ఉత్తమ మున్సిపల్ సిబ్బందిగా ఎంపికైన శ్రీకాంత్, వెంకన్న, వీరబాబులకు ప్రసంసా పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ ప్రకాశ్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, జిల్లా మలేరియా నివారణ అధికారి సాహితి, కోదాడ రూరల్ సీఐ రామకృష్ణా రెడ్డి, కౌన్సిలర్లు కొణతం చిన్న వెంకటరెడ్డి, రణపంగ నాగయ్య, బాష, షహనాజ్, అలక సరిత, తాల్లూరి సాయి, కొదమగుండ్ల సరిత, బాణోతు లలితాభరత్, నూకల సుగుణ, బచ్చలకూరి ప్రకాశ్, బైరెడ్డి జితేందర్ రెడ్డి, వేమూరి నాగవేణి, కుంకు సులోచన, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వైద్యాధికారి నాగిణి, తాసీల్దార్ సైదులు, ఎంపీడీఓ శంకరయ్య పాల్గొన్నారు.