రామగిరి, మార్చి 6 ;చిగురు తొడుగుతున్న పచ్చని ఆకులు, విరబూసిన మోదుగు పూలు వసంతోత్సవానికి నిదర్శనం. మంగళవారం రంగుల కేళి హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి కాముడి దహనం చేసి వేడుకులకు శ్రీకారం చుట్టారు. రంగులు పులుముకొని చిన్నా పెద్ద ఆటపాటలతో ఉత్సాహంగా గడుపనున్నారు.
గుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో కాముడి దహనం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం కాముడి దహనం నిర్వహించారు. కొండకింద పాత గోశాల వద్ద కట్టెలను పేర్చి ఆలయ పురోహితుడు నాగరాజు శర్మ పాల్గొని దహన కార్యక్రమాన్ని చేపట్టారు. వసంత రుతువు శోభకు సౌందర్యయుత రంగుల పండుగ హోలీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామ దహనం విశిష్టతను వివరించారు. అనంతరం పలువురు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
సహజ సిద్ధ రంగులకే ప్రాధాన్యం..
హోలీ వేడుకల్లో రసాయనాలతో తయారుచేసిన రంగులు కాకుండా సహజ సిద్ధ రంగులను ఉపయోగించేందుకు ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారు. మోదుగు, బంతి, మందారతోపాటు ఇతర పలు రకాల పూలను సేకరించి రంగులను సిద్ధం చేసుకున్నారు. హోలీ వేడుకలు జరుపుకునే సామగ్రి కోసం మారెట్లలో గిరాకీ కొనసాగింది. రంగునీళ్లు చల్లుకునేందుకు ఉపయోగించే గన్స్తోపాటు ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు.