రామన్నపేట, సెప్టెంబర్ 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2కోట్లతో నిర్మించిన గుండా సత్తయ్య స్మారక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ….సొంత ఊరిపై మమకారంతో కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నే విధంగా తండ్రి పేరు మీద ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. కన్న తల్లితో సమానమైన సొంత ఊరు అనుబంధం పేగు బంధం లాంటిదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడానికి వెయ్యి గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఆలోచనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండి సామాజిక కార్యక్రమాలు నిర్వహించి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అదనపు ఉపాధ్యాయులను నియమించి పిల్లలకు సరళంగా అర్ధమయ్యేలా విద్యను బోధించి ప్రతిభ వంతులను చేయాలన్నారు. సుమధుర ట్రస్ట్ చైర్మన్ గుండా మధుసూదన్ మాట్లాడుతూ గ్రామప్రజలు నాణ్యమైన విద్యకు దూరం కావద్దనే ఉద్దేశంతోనే పాఠశాల భవనంతో పాటు కంఫ్యూటర్లు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న జగన్ మోహన్, డీఈఓ నారాయణరెడ్డి, ఆర్డీఓ జగన్నాథం, తాసీల్దార్ లాల్‌బహదూర్, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నం ద్యాల భిక్షంరెడ్డి, మదర్ డెయిరీ డైరక్టర్ మందడి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాజవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచ్ బందెల యాదయ్య, ఎంపీటీసీలు వేమవరపు సుధీర్‌బాబు, గాదె పారిజాత, దోమల సతీశ్, సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి,అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడ్డి, కడమంచి సంధ్య స్వామి, ఉప్పు ప్రకాష్, బద్దుల ఉమారమేశ్, మల్లేశం, నరేందర్ పాల్గొన్నారు.