నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), జూన్ 13 : వియత్నాంలోని హో చి మిన్ నగరంలో గల టన్ డక్ థాంగ్ యూనివర్సిటీలో ఈ నెల 12, 13న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పోర్ట్స్ సైన్స్ 2025 సదస్సు జరిగింది. క్రీడల్లో సాంకేతికత వినియోగం, స్థిరత్వం అలాగే సమగ్ర ఆరోగ్యం అనే అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ కాన్సరెన్స్కు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం జరిగిన సెమినార్లో ఆయన పాల్గొని ”Psychological Factors Influencing Performance : A Case Study of Sports persons at Mahatma Gandhi University, Nalgonda, Telangana, India” అనే అంశంపై ప్రసంగించారు.
శ్రీనివాస్ రెడ్డిని నిర్వాహకులు అభినందించి జ్ఞాపిక అందజేశారు. ఆయనతో పాటు ఎంజీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డికి ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టార్ అల్వాల రవి, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, స్పోర్ట్స్ బోర్డు కో ఆర్డినేటర్ డాక్టర్ చింత శ్యామ్‌సుందర్, స్పోర్ట్స్ బోర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మురళి, బోధన బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.
Nalgonda : అంతర్జాతీయ సెమినార్లో ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసంగం