రామగిరి, నవంబర్ 07 : శ్రీలంకలోని సబరగమువా యూనివర్సిటీలో అప్లైడ్ సైన్సెస్ ఫ్యాకల్టీ, స్పోర్ట్స్ సైన్సెస్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వై.శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 6, 7వ తేదీల్లో జరిగిన సెమినార్లో ‘స్మార్ట్ టైపింగ్ ఇంటిగ్రేటింగ్ సైన్స్ ఇన్టు ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్’ అనే అంశంపై ఆయన ప్రసంగించి పరిశోదన పత్రం సమర్పించారు. దీంతో నిర్వాహకులు ఆయనను అభినందించి ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంజీయూ ఖ్యాతి చాటిన శ్రీనివాస్‌రెడ్డిని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్, వివిధ విభాగాల అధిపతులు అభినందించారు.

Ramagiri : అంతర్జాతీయ సెమినార్లో ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగం