దేవరకొండ రూరల్, ఏప్రిల్ 22 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందాలన్నారు. ఈ ప్రాంత ప్రజలు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, అష్టెశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.