నల్లగొండ రూరల్, జనవరి 13 : మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పట్టణాల్లో చేపట్టిన ప్రగతి కళతోనే నేడు జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయని ఎంబీసీ జాతీయ కన్వీనర్, మున్సిపల్ కో ఆప్షన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ర్టానికి జాతీయ అవార్డులతోపాటు 8 చెత్త రహిత పట్టణాలు, 2 వాటర్ ప్లస్ పట్టణాలు, 77 ఓడీఎఫ్ పట్టణాలు, 45 ఓడీఎఫ్ ప్లస్ పట్టణాలుగా ఎంపికైనట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో లక్ష జనాభా పైబడిన నల్లగొండ మున్సిపాలిటీకి జాతీయస్థాయిలో 92వ, రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ రావడం హర్షణీయమని పేర్కొన్నారు. గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పనితీరుతోనే రాష్ర్టానికి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయని తెలిపారు.