వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధి మత్స్యగిరి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పుర స్కరించుకొని స్వామి వారి కల్యాణాన్ని వేద పండితులు శాస్ర్తోక్తంగా ఆదివారం నిర్వహించారు.
కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో రవికుమార్, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.