చిట్యాల, మే 1:మండలంలోని వెలిమినేడు శివారు నోస్ కంపెనీలో మరోసారి భారీ పేలు డు సంభవించి ఎనిమిది మందికి గాయాలు కాగా అందులో ఒకరు మృతి చెందారు. గతంలోనూ ఈ కంపెనీలో ఇలాంటి ఘటనలు జరిగి కార్మికులు చనిపోయారు. కేవలం 20 రోజుల్లో ఇది రెండో ఘటన కావడంతో కంపెనీలోని కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికుల రక్షణపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనపై దర్యాప్తు సమయంలోనూ గతంలో ఎప్పుడు కంపెనీలో పేలుళ్లు జరుగలేదని యాజమాన్యం అధికారులకు తెలియజేయటం వారి విధానాన్ని తెలియజేస్తుంది. ఘటనకు సంబంధించి కంపెనీ సిబ్బం ది, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలిపిన ప్రకారం… శుక్రవారం మధ్యాహ్నం ఒకేసారి భారీ పేలుడు జరిగి కంపెనీలోనుంచి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనతో కం పెనీ సమీపంలోకి చేరుకున్నారు అప్పటికే అందులోని సిబ్బంది బయటకు పరుగులు తీస్తూ కనిపించారు. కంపెనీలోని 3వ బ్లాక్‌లో రియాక్టరు పేలి పొగలు కమ్ముకున్నాయి.
ఆ సమయంలో ఆ బ్లాక్‌లో 9 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. వారందరూ గాయపడ్డారు. అందులో చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణ(30) పరిస్థితి విషమంగా ఉండటం తో అత్యవసర చికిత్స కోసం హైదరాబాదులోని డీఆర్డీఏ అపోలో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. శివప్రసాద్, శంకర్, లోకేశ్, లింగస్వా మి, డేవిడ్ గాయపడిన వారిలో ఉన్నారు. డేవిడ్ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కాగా మిగిలిన వారు తెలంగాణకు చెందినవారు. వరుసగా పేలుళ్లు సంభవిస్తుండడంతో కంపెనీలోని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 రోజుల క్రితం జరిగిన ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న కార్మికులకు శుక్రవారం సంఘటనతో మరింత ఆందోళన చెందుతున్నారు. కంపెనీ యజమాన్యంపై తగిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వరుసగా సంఘటనలపై ఆగ్రహం వ్యక్తి చేసి, విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించారు.