మలయాళ కథానాయిక భావన ప్రధాన పాత్రలో నటించిన ‘హంట్’ చిత్రం తెలుగులో ‘డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్’ అనే పేరుతో అనువాదమవుతున్నది. షాజీ కైలాస్ దర్శకుడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా వైద్యురాలి రేప్ అండ్ మర్డర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇటీవలే టీజర్‌ను నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి విడుదల చేశారు. ఈ సినిమాలోని భావోద్వేగాలు హృదయాల్ని కదిలిస్తాయని, ఆ వైద్యురాలి ఆత్మఘోషను ఆవిష్కరిస్తూ కథ సాగుతుందని మేకర్స్ తెలిపారు. రెంజి పనికర్, చందునాథ్, డెయిన్ డేవిస్, అనుమోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కైలాస్ మీనన్, దర్శకత్వం: షాజి కైలాస్.