
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వ చేసిన వ్యవసాయ చట్టాలతో మార్కెటింగ్ వ్యవస్థ నిర్వీర్యమై రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రాదని విప్లవ దర్శకుడు, నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ఆదివారం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలిసి స్థానిక టీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థ అనేది మన దేశంలో అమలు కాదని ఈ పద్దతి వల్ల సన్న చిన్న కారు రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండబోదన్నారు. ఈ కేంద్ర వ్యవసాయ, విద్యుత్ చట్టాలు అన్నదాతల పాలిట ఉరితాళ్లుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను రైతులకు అవగాహన పరచాలనే ఉద్దేశంతోనే రైతన్న సినిమాలో వివరిం చానని ఈ సినిమా చూసి రైతులకు జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను నిత్యం కాపాడుతూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటంతో పాటు పండిన పంటను కొనుగోలు చేసి రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకుంటుంటే నరేంద్ర మోడీ మాత్రం రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

నేడు రైతు కులం వెనుకబడ్డదని వ్యవసాయ చట్టాలు అమలైతే రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో 3.60లక్షల ఆత్మహత్యలు జరిగితే స్వామినాథన్ కమిషన్ వేసిన ప్రభుత్వం దాన్ని మాత్రం అమలు చేయలేదని అన్నారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం పట్టించుకోవటం లేదని ఈ ధర్నా సందరర్భంగా 600 మంది రైతులు చనిపోయినా స్పందించక పోవటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లు మాట్లా డుతూ రైతన్న సినిమాలో కేంద్ర చట్టాలపై పూర్తి స్థాయి లో వివరించినందున ప్రతి రైతు ఆ సినిమా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సందేశాత్మక చిత్రాలు, సామాజిక చిత్రాలు తీసేనారాయణ మూర్తి కేంద్ర చట్టాలతో రైతులకు జరిగే అన్యాయంపై తీయటం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలతో రైతుల ప్రాణాలతో చెలగా టం ఆడాలని ప్రయత్నం చేస్తుందని రాష్ట్రంలో రైతులను కాపాడాలని సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలతో మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రయత్నం చేస్తుందన్నారు.

రైతు చట్టాలపై రైతన్న సినిమాలో వివరించినందున అక్టోబర్ రెండో తేదీన అందరం నల్లగొండలో రైతన్న సినిమాను చూద్దా మని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో విద్య, వైద్యం పై సినిమా తీయాలని.. ప్రభుత్వ వైద్యం ముద్దు, ప్రైవేటు వైద్యం వ ద్దు అనే కోణంలో సినిమా తీస్తే తనవంతు సహకారం చేస్తానని.. అదేవిధంగా ఆ సినిమాలో తనకు ఓ పాత్ర ఇవ్వాలని కం చర్ల నారాయణ మూర్తిని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల బతుకు చిత్రమే రైతన్న
మిర్యాలగూడ: రైతులు వ్యవసాయ రంగంలో పడుతున్న కష్ట నష్టాలను, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలే ఇతి వృత్తంగా రైతన్న సినిమా తీశాన ని, అన్నదాతల బతుకు చిత్రమే రైతన్న సినిమా అని సినీ నటుడు నారా యణమూర్తి అన్నారు. సినిమాను అన్ని వర్గాల వారు ఆద రించాలని కోరారు. ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును ఆయన కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణమూర్తిని సన్మానించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై రైతుల కష్ట నష్టాలపై తీసిన సినిమాను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు.
