గుర్రంపోడు, మార్చి 30: మండలంలోని బుడ్డారెడ్డి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి పెద్దిరెడ్డి అంజిరెడ్డి భారీ విరాళం అందించారు. సోమవారం ఆయన రూ. 65,000లను గుడి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మాతృమూర్తి పెద్దిరెడ్డి పుష్పమ్మ జ్ఞాపకార్ధం భారీ విరాళం ఇచ్చినట్టు వెల్లడించారు.
తన తల్లి పెద్దిరెడ్డి పుష్పమ్మ పేరుతో భారీ విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని అంజిరెడ్డి తెలిపారు. గర్భగుడి తలుపుల నిర్మాణం కోసం ఈ విరాళం అందజేసినట్లు అంజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింగం బాలకృష్ణ, చిన్న వెంకటరెడ్డి, లావణ్య, సింగం ప్రవీణ్ ,వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.