దామరచర్ల, ఏప్రిల్ 18 : గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సీడీపీఓ చంద్రకళ అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు గ్రాడ్యుయేషన్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలతో పాటు ఆరేళ్ల లోపు పిల్లలు రక్తహీనత నివారించేందుకు పౌష్టికాహారాన్ని తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. శిశువు పుట్టిన వెయ్యి రోజుల వరకు పోషణకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక ద్వారా పర్యవేక్షించాలన్నారు,
ఈ నెల 9 నుండి 23 వరకు పోషణ పక్షం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, తాసీల్దార్ జవహర్లాల్, మండల వైద్యాధికారి నాగేశ్వరరావు, సర్పంచ్ బంటు రేణుక సిరి, పంచాయతీ కార్యదర్శి పున్నయ్య, ఉప సర్పంచ్ ప్రియాంక, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు పి.మాధవి, జి.సంధ్య, అంగన్వాడీ టీచర్లు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.