ధర్నాలను విజయవంతం చేయండి : ఎస్కే నయీమ్
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నుండి ఆరు రోజులపాటు జరగనున్న ధర్నాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పార్టీ కార్యాలయంలో...
కోదాడ, సెప్టెంబర్ 01 : బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నుండి ఆరు రోజులపాటు జరగనున్న ధర్నాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ధర్నాలకు పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ నాయకులు చీమ నరేష్, ఉపేంద్ర గౌడ్, కరీముల్లా బాబా, బత్తుల ఉపేందర్, తాజుద్దీన్, శ్రీకాంత్, శ్రీను, చింతల లింగయ్య, నాగరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BRS
- KOdada
- SK Nayeem
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

