కట్టంగూర్, జులై 10 : కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మహిళలకు అందించే పథకాలను వివరించారు. ఏపీఎం సైదులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంఘాల్లో లేని మహిళలను కొత్తగా సంఘాల్లో చేర్పించాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీసీలు కాడింగ్ శంకర్, సంఘబంధం కార్యదర్శి ఎస్కే.రజియాబేగం, మాజీ అధ్యక్షురాలు యామిని, వీఓఏలు మిర్యాల చంద్రకళ, పోలగొని అనిత, గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.