పెన్పహాడ్ ఎప్రిల్ 11 : గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. ఫూలే జయంతిని శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని ఫూలే సేవలను కొనియాడారు.
ఆనాటికే దళిత ఉద్ధరణ, దళిత బాలికల, మహిళా విద్య విముక్తి, సామాజిక విప్లవం ఫూలే దంపతుల ప్రత్యేకత అన్నారు. దళితుల కోసం ఫూలే దంపతులు జీవితాలనే త్యాగం చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు,ఈసి మహేష్,శివ రాంకుమార్, బుచ్చన్న, అనూష, వెంకన్న, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.