కోదాడ, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు పూలే ఆలయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్తిబాబు, పట్టణాధ్యక్షుడు ఎస్కే.నయీమ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాల విద్యాభివృద్ధికి పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. సామాజిక రుగ్మతలు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు పూలే కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లలిత, పిట్టల భాగ్యమ్మ, కార్ల సుందర్ బాబు, చీమ శ్రీనివాస్, గోపాల్, కాసాని మల్లయ్య గౌడ్, బత్తుల ఉపేందర్, రాంబాబు, వెంకటనారాయణ, సోమేశ్, దస్తగిరి, లాజర్, వెంకట్రావు పాల్గొన్నారు.