దామరచర్ల, మార్చి 9 : శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. శివపార్వతులను ఆలయ ఆవరణలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చి కల్యాణతంతు జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధయ్య, ఈఓ మృత్యుంజయ శాస్తి పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : మండలంలోని చిరుమర్తిలో గల వరాల సోమేశ్వరస్వామి ఆలయంలో శనివారం శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. స్వామివారి కల్యాణానికి సినీ డైరెక్టర్ ఎన్.శంకర్-మాధవి దంపతులు హాజరై స్వామివారికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గజ్జి మధుసూదన్, అమృతవల్లి, గంటెపంగ యాదయ్య, ముదిరెడ్డి దేవేందర్‌రెడి, వెంకటాచారి, భక్తులు పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలోని బట్టుగూడెంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో కున్రెడ్డి వెంకట్‌రెడ్డి, రామంజిరెడ్డి, నాగిరెడ్డి, శేషిరెడ్డి, కున్రెడ్డి గోవిందరెడ్డి, చామకురి రాహూల్‌రెడ్డి, లక్క లింగారెడ్డి, విజయ్, నక్కల శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని వల్లాలలో శనివారం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు స్వామివారి కల్యాణతంతును అశేష జనవాహిని నడుమ నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
హాలియా : మండలంలోని పేరూరు సోమేశర్వస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రిక్కల కొండారెడ్డి, అర్చకులు, ధర్మకర్తలు, పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు కొనసాగాయి. శుక్రవారం జాగారం చేసిన భక్తులు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఇనుపాములలోని పచ్చల పార్వతీ సోమేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుకను నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గుడివాడలోని రాజరాజేశ్వరి ఆలయం, కేతేపల్లి శివాలయాల్లో కల్యాణ వేడుకలు నిర్వహించారు.
నిడమనూరు : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని ముప్పారం పార్వతీరామలింగేశ్వరాలయాన్ని శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఆలయ చైర్మన్ సుంకి మల్లప్ప ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి సైతం ప్రత్యేక పూజలు చేశారు. మేరెడ్డి చెన్నక్రిష్ణారెడ్డి, ఎంపీటీసీ నాగేంద్రానారాయణ, సైదులు, హన్మయ్య, సత్యనారాయణ, కోటి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) : మండలంలో రంగుండ్లలో మల్లప్పయ్య స్వామిని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఎమ్మెల్సీని సత్కరించారు. మాజీ ఎంపీపీ పెద్దిరాజుయాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రమణరాజు, కొత్తపల్లి పీఏసీఎస్ డైరెక్టర్ దేశబాబునాయక్, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.