అర్వపల్లి, సెప్టెంబర్ 17 : ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో జాజిరెడ్డిగూడెం వాసి మద్దెల యామిని ఉత్తమ ప్రతిభ చూపింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మద్దెల రవి – సంధ్య ల కుమార్తె యామిని జాతీయ స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ (మృత్తిక శాస్త్రం) విభాగంలో ఆల్ ఇండియా 63వ ర్యాంక్ సాధించింది. యామిని అశ్వరావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో విద్యను అభ్యసించింది. ర్యాంక్ సాధించడంపై కళాశాల ఏడీ హేమంత్ కుమార్, ఆచార్యులు, గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
ఐసీఏఆర్ ఏఐఈఈఏ పీజీ (ICAR AIEEA PG) అనేది వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశం కోసం నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఐసీఏఆర్ పరిధిలోని యూనివర్సిటీలు, కళాశాలల్లోని ఆల్ ఇండియా కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.