Suryapeta | సూర్యాపేట : పట్టణంలోని డాల్ఫిన్ బేకరీ, చంద్రశేఖర్ హాస్పిటల్, ఆర్వీ హాస్పిటల్, బండల బజార్, సిద్ధార్థ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చికుక్క తిరుగుతూ స్వైరవిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో సుమారు పది మంది గాయపడ్డారు.
పట్టణంలోని 43వ వార్డు నెహ్రూ నగర్ ప్రాంతంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ పాత బండల బజార్‌కు చెందిన వెంకటమ్మ అనే మహిళను కరిచింది. అంతేకాకుండా బాతులు, మేకలపై కూడా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఎనిమిది మందిని కరిచిన తర్వాత స్థానికులు వెంబడించి కుక్కని హత మార్చారు.