గుర్రంపోడు, మార్చి 20 : గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్, ఆలయ చైర్మన్ జాల పెద్ద సత్తయ్య యాదవ్, సర్పంచ్ జాల యాదయ్య మాట్లాడుతూ.. స్వామివారి వార్షికోత్సవ వేడుకను గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. నేడు జరిగే స్వామి వారి కల్యాణానికి ప్రతి ఒక్కరు హాజరై వీక్షించాలని కోరారు. ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవం ఉన్నందున గ్రామ ప్రజలందరూ స్వామివారికి నైవేద్యాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వట్టికోడు శ్రీనివాస శర్మ, మోపోజ్ కిరణాచార్యులు, వైస్ చైర్మన్ వెలుగు భిక్షం, కమిటీ సభ్యులు రావుల సైదులు గౌడ్, తడకమళ్ల అంజయ్య, మేడి వెంకన్న, పోలేపల్లి భద్రయ్య, వెలుగు జలంధర్, గంగసాని యాదయ్య, మోపురి మురళి, పోలేపల్లి నరసింహ, మోపురి ఆచారి, జాల నరసింహ, తగుల యాదయ్య, తగుల వెంకటయ్య, వంగూరి రమేశ్ పాల్గొన్నారు.