దామరచర్ల, జూన్ 17 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని మహిళా సంఘాలకు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి రూ.36.86 కోట్ల రుణాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్డీఓ పీడీ వై శేఖర్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన గ్రామ సంఘం పదాధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నిరుపేద మహిళ మహిళా సంఘంలో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు చాలా పెద్దపీఠ వేస్తుందని, మహిళలు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా అందే రుణాలన్నీ కూడా తిరిగి సక్రమంగా చెల్లించాలన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అమలవుతున్న పథకాలు అన్ని సంఘాలకు అందే విధంగా చూడాలన్నారు. శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు రికవరీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గుంటి దిలీప్‌కుమార్, సీసీలు పల్ల శ్రీను, ఎల్.శంకర్, కవిత, ఎస్ఆర్పీలు తిరుమల, సుమతి, కొండ్రపోల్, దామరచర్ల, కేశవపురం, దిలావర్పూర్ గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.
Damaracharla : దామరచర్ల పరిధిలోని మహిళా సంఘాలకు రూ.36 కోట్ల రుణాలు : డీఆర్డీఓ పీడీ శేఖర్‌రెడ్డి