నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 03 : నల్లగొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు బాత్క సహస్ర, సాత్విక్ తల్లిదండ్రులు కాలం చేశారు. నానమ్మనే చిన్నారులను పోషిస్తుంది. పిల్లల పోషణ కష్టంగా ఉందని తెలుసుకుని నకిరేకల్‌కు చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు బుధవారం వారి ఇంటికి వెళ్లి 75 కేజీల బియ్యం, మూడు నెలలకు సరిపడా 30 రకాల నిత్యావసరాలు, రూ.5 వేలు అందించి మానవత్వం చాటారు.
లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మిత్రులంతా ఒక వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడి ప్రతి నెల రూ.200 జమ చేస్తూ సమకూరిన డబ్బులతో ఇలా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు బ్రహ్మదేవర నరేశ్, కర్నాటి నరేశ్, గుండు విక్రమ్, ఉపేందర్, శంకర్, సమ్మక్క పాల్గొన్నారు.