కట్టంగూర్, సెప్టెంబర్ 15 : లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి బసవోజు వినోద్ కుమార్, జీఎస్టీ ఆకవరపు బ్రహ్మచారి, జీఎంటీ కక్కిరేణి నవీన్, జీఈటీ తవిదబోయిన నర్సింహ్మ, ఎల్‌సీఐఎఫ్ బొల్లోజు వెంకటాచారి, ప్రచారకర్త చెరుకు శ్రీనివాస్, గౌరవ సలహాదారుడు వున్న సుందరయ్యతో పాటు క్లబ్ కార్యవర్గంతో డిస్ట్రిక్ గవర్నర్ రేపాల మదన్ మోహన్, పీఎంసీసీ పాస్ట్ జీఎస్టీ కో ఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం నూతన కార్యవర్గానికి శాలువాలు, పూలమాలలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, కేవీ.ప్రసాద్, కోడే సతీష్ కుమార్, గట్టుపల్లి అశోక్ రెడ్డి, కొండ సంతోష్, జోన్ చైర్మన్లు బుడిగ శ్రీనివాస్, లక్మారెడ్డి, శంభులింగారెడ్డి, సత్యనారాయణ, దేవరశెట్టి శ్రీనివాస్, కందాల పాపిరెడ్డి, నెమరుగొమ్ముల రాంమోహన్, ఎదుళ్ల అంజిరెడ్డి, రేపాల సతీష్, కందాల ప్రేమ్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.