నల్లగొండ రూరల్, ఆగస్టు 20 : విశ్వ లింగాయత్ ట్రస్ట్ వారి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నల్లగొండలోని సావర్కర్ నగర్లో గల శ్రీ బసవేశ్వర భవన్లో వీర శైవ లింగాయత్ లింగ బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు ఇమ్మడి పరమేశ్, అధ్యక్షుడు పొగాకు నాగరాజు తెలిపారు. బుధవారం సంఘం భవనంలో వివాహ పరిచయ వేదిక పోస్టర్‌ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఐడి నంబర్ తీసుకుని పాల్గొనాలని సూచించారు.
జిల్లా సంఘం సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని లింగాయత్‌లు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మిశెట్టి కోటి, కోశాధికారి వరప్రసాద్, సలహాదారులు ఉప్పు శేఖర్, బత్తుల శ్రీశైలం, వెంబడి లింగప్ప, వీరశైవ పురోహితులు ప్రదీప్, కోటి నాగరాజు, దొడ్డ వీరయ్య పాల్గొన్నారు.