రామగిరి, అక్టోబర్ 27 : ధన్వంతరి పరివార్ తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ధన్వంతరి జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో, వైద్య రంగ అభివృద్ధిలో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కంది సూర్యనారాయణ చేస్తున్న సేవలకు గుర్తింపుగా కంది సూర్యనారాయణ– సుగుణ దంపతులను ఛత్తీస్‌ఘడ్ వైశాలి ఎమ్మెల్యే రికేస్ సెన్, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ అబివృద్ధి సంస్థ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో వారిని సన్మానించి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.బాగయ్య, అసల్క్ ర్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ శ్రీరామ్, ధన్వంతరి పరివారం బృందం, దుగ్యాల అశోక్, దుగ్యాల ప్రేమ్‌నాథ్, నేలపట్ల చంద్రశేఖర్, కంది హనుమాన్ ప్రసాద్, కపిల్ ప్రసాద్, సాయి తేజ, మంజుల, కవిత, ఉల్లాస్ పాల్గొన్నారు.