తుంగతుర్తి, జనవరి 30 : మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా నాయకుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీజీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన అహింసా మార్గంలో నడుస్తూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఈగ నాగయ్య, పాలవరపు సంతోష్, నాయకులు ఓరిగంటి అశోక్, కేదారి, శ్రీనివాస్, సుభాష్ పాల్గొన్నారు.