– ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత
పెన్పహాడ్, జనవరి 17 : రైతులు తమకు ఎదురయ్యే న్యాయ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందని సూర్యాపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు తెలిపారు. వివాదాలు పరిష్కరించేందుకు ఉచితంగా తగిన సూచనలు, సలహాలు అందేలా చూసి వివాదాలు పరిష్కరించేందుకు తోడ్పాటునిస్తుందని చెప్పారు. శనివారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని రైతు శిక్షణా కేంద్రంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆధునిక పద్ధతులను అవలంబించి రైతులు అధిక పంట దిగబడులు తీసుకు రావాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అవలంబిస్తున్న పలు పథకాలను రైతులకు వివరించారు.
సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నామినేటెడ్ మెంబర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గుంటూరు మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కోర్టు డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకటరత్నం, డిఫెన్స్ కౌన్సిల్స్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్, కొండగడపల ప్రియదర్శిని, న్యాయవాది కోకా రంజిత్ కుమార్, తాసీల్దార్ ధరావత్ లాలు నాయక్, ఎస్ఐ కస్తాల గోపికృష్ణ, ఏపీఎం దాసరి అంజయ్య, ఎం ఆర్ ఐ మర్కాల రంజిత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వగ్గు రవి, ఏఈఓ వికాస్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పారా లీగల్ వాలంటీర్లు వగ్గు సోమన్న, వగ్గు ప్రవీణ్, వర్కాల అంజయ్య, మీసాల నాగయ్య, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది భాషా నాయక్, వర్షిత్ పాల్గొన్నారు.