నల్లగొండ రూరల్, జనవరి 30 : నల్లగొండ పట్టణంలోని బోయవాడ ప్రాథమిక పాఠశాలకు యునిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎల్ఈడీ టీవీ బహుకరించింది. అలాగే విద్యార్థులకు బ్యాగులు, నోట్‌బుక్స్ అందజేసింది. యునిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ శుక్రవారం నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో నూతన బ్రాంచ్ ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకుని విజ్ గ్రూప్ ఫౌండర్ నగామి పాఠశాలకు టీవీ, బ్యాగులు, నోట్‌బుక్స్ అందజేశారు. మనీ, గోల్డ్ లోన్లు, విదేశీ కరెన్సీ మార్పిడి, విమాన ప్రయాణ టికెట్ల సర్వీసులతో పాటు టూర్ ప్యాకేజీలను తమ సంస్థ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యునిమోని డైరెక్టర్, సీఈఓ ఆర్.కృష్ణణ్, మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీపతి రాజు, బ్రాంచ్ మేనేజర్ కిరణ్ కుమార్, బ్రాంచ్ సిబ్బంది, హెడ్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.