భువనగిరి అర్బన్/వలిగొండ, మార్చి 26 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నిరుపేదల పక్షాన కొనపురి సాంబశివుడు పోరాటం చేశారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు నాయకులు అన్నారు. బీఆర్ఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొనపురి సాంబశివుడి అలియాస్ కునపూరి అయిలయ్య 14వ వర్ధంతిని బుధవారం భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద, ఆయన స్వగ్రామం వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సాంబశివుడి చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్తోపాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంబశివుడు చేసిన పోరాటాలను గుర్తుకు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ భువనగిరి పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, బీఆర్ఎస్ వలిగొండ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, బీరు మల్లయ్య, అతికం లక్ష్మీనారాయణ, ర్యాకల శ్రీనివాస్, ఇట్టబోయిన గోపాల్, నక్కల చిరంజీవి, దిడ్డికాడి భగత్, తాడె రాజశేఖర్, పుట్ట వీరేశ్, బబ్లు, ఇస్మాయిల్, రహీం, సురేశ్, యాస సంతోష్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, పనుమటి మమతానరేందర్‌రెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి, కునపురి కవిత, డేగల పాండరి, కునపురి స్వర్ణలత, జానీ అఫ్రోజ్, నారి మల్లేశం, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.