కోదాడలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఏపీలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను నిరసిస్తూ బుధవారం కోదాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని, న్యాయవాది కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని..
కోదాడ, ఏప్రిల్ 08 : ఏపీలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను నిరసిస్తూ బుధవారం కోదాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని, న్యాయవాది కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, కోశాధికారి కోడూరు వెంకటేశ్వరరావు, లైబ్రరీ సెక్రటరీ గాలి శ్రీనివాస్ నాయుడు, సీనియర్ న్యాయవాదులు నాగార్జున, సుధాకర్ రెడ్డి, రంగారావు, కాకర్ల వెంకటేశ్వర్లు, హేమలత, రంజాన్ పాషా, నాగుల్ పాషా, హనుమంతరావు, పెద్దబ్బాయి, అబ్దుల్ రహీం, ఉయ్యాల నరసయ్య, రియాజ్, తాటి మురళి, రమేష్ బాబు, శరత్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- KOdada
- lawyers
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

