కట్టంగూర్, మే 29 : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా స్థాయి తరగతులు జూన్ 22, 23 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. గురువారం కట్టంగూర్‌లో వంటెపాక కృష్ణ అధ్యక్షతన జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, రాజీవ్ యువ వికాసం పథకాలు ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. ఇంటిగ్రెటెడ్ స్కూల్ పేరున గురుకులాలను ఎత్తివేయడం మానుకోవాలన్నారు.
నాణ్యమైన విద్యా, వైద్యం అందరికి ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. శిక్షణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులకు కేవీపీఎస్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు పింజర్ల సైదులు, గాదె నర్సింహ్మ, బొల్లు రవీందర్, కోడిరెక్క మల్లన్న, రాధిక, దండు రవి, శ్యామ్, గుడుగుంట్ల రామకృష్ణ, బొడ్డు బాబురావు, జాల రమేశ్, ముసుకు రవీందర్, క్రాంతి, శైలజ పాల్గొన్నారు.