రాజాపేట, ఏప్రిల్ 29 : పేద కుటుంబాల కుర్మ కుల బాంధవులకు ఆపదలో అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, బీఆర్ఎస్ పార్లమెంటరీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలోని రేణికుంటలో ఇటీవలే పిడుగుపాటుతో 50 గొర్రెలు మృతి చెంది నష్టపోయిన గొర్రె కాపరి బండి మల్లేశం కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా లక్షలాది రూపాయల విలువ గల గొర్రెలు కోల్పోయి రోదిస్తున్న గొర్రె కాపరిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ పరంగా పరిహారం అందిస్తామని తెలిపారు. పేద కుర్మ కులస్తుల కుటుంబాలకు ఆపదలు వస్తే సంఘం తరఫున అండగా నిలుస్తామన్నారు. పేదింటి బిడ్డలకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్నామని తెలిపారు.
వారి వెంట కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నరసింహులు, కొమురెల్లి మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్, మండలాధ్యక్షుడు సుధాకర్, నాయకులు గుంటి కృష్ణ, రేగు సిద్ధులు, మరల నాగరాజు, కౌడే మహేందర్, అచ్చయ్య, నమిలే మహేందర్ గౌడ్, బుడిగ పెంటయ్య గౌడ్, ఇంజ నరేష్, ఐరేని నవీన్ కుమార్, నగేష్, కోరే వీరయ్య తదితరులు ఉన్నారు.