కోదాడ, జూలై 24 : కోదాడ మండలంలో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు సందర్భంగా కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ సలీం షరీఫ్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా శాలువా, పూలమాలతో సత్కరించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర జిల్లాల విద్యాశాఖ పునఃసమీక్షలో ఈ సన్మానం జరిగింది. సూర్యాపేట జిల్లాలో కోదాడ మండలంలో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని విస్తృతంగా ఉపాధ్యాయులచే ప్రచార నిర్వహించడంలో ఎంఈఓ విస్తృత కృషి చేశారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.