
నల్లగొండ రూరల్: 40వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలలో ఉమ్మడి నల్లగొడ బాలికల జట్టు మూడో స్థానం పొంది కాంస్య పథకం దక్కించుకున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్య క్షుడు కె.ఈశ్వర్ గౌడ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నగాని కృష్ణమూర్తిగౌడ్ తెలిపారు.
ఈ నెల 28 నుంచి 31 వరకు సిద్దిపేటలో జరిగిన పోటీలలో ఉమ్మడి నల్లగొడ బాలికల జట్టు మంగళవారం కాంస్య పథ కం సాధించిందన్నారు. సిద్దిపేట డీఎస్పీ రామేశ్వరరావు బహుమతులు అందజేశారు. జిల్లా బాలికల జట్టు కాంస్య పథకం సాధించడంపై పీఈటీలు విజయ్, రమేశ్, నాగేశ్వరరావు, మురళి, జానీ, వెంకట్‌రెడ్డిలు అభినందించారు.