Harish Rao | గట్టుప్పల్, అక్టోబర్ 07 : ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ రంగానికి, నేత కార్మికుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని హరీశ్ రావు గుర్తుచేశారు.
ఎన్నికల్లో విజయం సాధించిన వజ్రమ్మ వెంకటేశం దంపతులను హరీశ్ రావు అభినందించారు. రాష్ట్రంలోని చేనేత కుటుంబాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కళాకారుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ గౌడ్, జగన్, గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!