నల్లగొండ రూరల్, జూలై 14 : కాలం పోతున్నా ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో పల్లెల్లో వరుణ దేవుడి కోసం ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సోమవారం నల్లగొండ మండలంలోని చిన్నసూరారంలో వరుణుడి రాక కోసం గ్రామంలోని మహిళలు కప్పలకు పెళ్లి చేసి గ్రామం మొత్తం తిరుగుతూ కప్ప కాముడు ఆడారు. ఈ కార్యక్రమంలో నారగోని పల్లవి, జ్యోతి, యాదమ్మ, అండాలు ,లింగమ్మ, సైదమ్మ, రేణుక, శ్రీదేవి, కవిత, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
Nalgonda Rural : చిన్నసూరారంలో వర్షాల కోసం కప్ప కాముడు