కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి)రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మం గళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఆలయం ముందు వెలసి న పుట్ట వద్ద, నూతనంగా ఏర్పాటు చేసిన గోపురం వద్ద కళశ పూజలు నిర్వహించి, హోమం, అభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
ఇదిలాఉంటే దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా రేణుక అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. కార్యక్ర మంలో ఈవో సత్యమూర్తి, చైర్మన్ యాదగిరి, అలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.