రామగిరి, జూన్ 9 : జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్షను ఆదివారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బాధ్యులు మాట్లాడుతూ త్వరలో జరుగబోయే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షపై అవగాహన కల్పించి వారు విజయం సాధించేలా కృషిలో భాగంగంగానే మోడల్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్ష వల్ల అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్, సబ్జెక్ట్‌పై అవగాహన వస్తుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య, నాయకులు పందిళ్లపల్లి బ్రహ్మచారి, డి. నర్సాజీ, లాయర్లు పాల్గొన్నారు.