నీలగిరి, డిసెంబర్ 06 : నల్లగొండ ఐబీసీ ఛానల్ జర్నలిస్ట్ రెడ్డిపల్లి యాదగిరి సౌత్ ఇండయా మీడియా అసోసియేషన్ (సిమా) అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో జగద్గురు సిద్ధేశ్వర స్వామి, సిమా అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణమూర్తి, ఎన్. కె. స్వామి చేతుల మీదుగా ఈ అవార్డును అయన అందుకున్నారు. ఈ అవార్డు ఆయనకు దక్కడం పట్ల పలువురు జర్నలిస్టులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.