నూతనకల్, డిసెంబర్ 12 : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు తీరును చూసి ప్రజలు వివిధ పార్టీలకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం ఆయన సమక్షంలో మండలంలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఇరుగు శ్యాం, బత్తుల ఉప్పులయ్య, తునికి వినయ్, దేశోజు బ్రహ్మచారి, బత్తుల శ్రీను, బొజ్జ సైదులు, శేఖర్, ఎల్లయ్య, సత్తయ్యతో పాటు మరో 30మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పాలన సాగుతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని, అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ కనకటి వెంకన్న, సర్పంచ్ కొంపెల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, నాయకులు బిక్కి బుచ్చయ్య, బత్తుల విజయ్, పులుసు లింగమల్లయ్య, విద్యాసాగర్, సురేశ్, సత్యనారాయణరెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.
మాదిగ విద్యార్థి యూనియన్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక
మోత్కూరు : ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. పట్టణంలో సోమవారం ఆయన సమక్షంలో మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురానికి చెందిన మాదిగ విద్యార్థి యూనియన్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చేతరాశి వీరస్వామితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
మద్దిరాల మండలంలో..
మద్దిరాల : సీఎం కేసీఆర్ మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందున పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన సమక్షంలో మండలంలోని జీ.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 10కుటుంబాల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. పార్టీలో కార్యకర్తలను కుటుంబసభ్యుల మాదిరిగా కాపాడుకుంటూ వారి అభివృద్ధికి నాయకత్వం పాటు పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ.రజాక్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కన్నా వీరన్న, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు గంగవెల్లి వెంకటనర్సింహారావు, లీగల్ సెల్ నాయకులు జిలకర చంద్రమౌళి, బొబ్బిలి ఉప్పలయ్య, పులిగిళ్ల వెంకన్న, రాజేంద్రప్రసాద్‌రావు పాల్గొన్నారు.