నల్లగొండ రూరల్, ఆగస్టు 21: నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామానికి చెందిన చింత నాగరాజు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గురువారం నాగరాజును పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సంస్థ అధ్యక్షుడు చింత పరశురాం, చింత విజయ్, నాగరాజు, మహంకాళి, వీరస్వామి పాల్గొన్నారు.