గుర్రంపోడ్, మార్చి 16 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని కుట్రపూరితంగానే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ప్రజా సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే అసెంబ్లీ నుంచి బయటికి పంపించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెండ్‌ను నిరసిస్తూ ఆదివారం గుర్రంపోడ్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే వారిని సభ నుంచి బయటికి పంపించడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో నిలదీస్తుండడంతో ఇలా చేస్తున్నదని తెలిపారు. అకారణంగా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాశం గోపాల్ రెడ్డి, పోలె రామచంద్రం, మునుకుంట్ల రాజేశ్‌రెడ్డి, వడిత్య నాగరాజు నాయక్, జాల మల్లేశ్, మునుకుంట్ల బాల్ రెడ్డి, కుంభం ప్రశాంత్ రెడ్డి, కూనూరు సైదిరెడ్డి, వేముల యాదయ్య, కుంటిగొర్ల లింగయ్య, ఇస్మాయిల్, శ్రీధర్, నల్ల శ్రీరాములు, కృష్ణ గౌడ్, కన్నెబోయిన అంజయ్య పాల్గొన్నారు.
ఆలేరులో సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆలేరు టౌన్ : జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆదివారం ఆలేరు పట్టణంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో చేశారు. అనంతంర సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రైతులు గోస పడుతున్నారని, వారి సమస్యలు తీర్చాలని అసెంబ్లీలో ప్రశ్నించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తారా? ఇది హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కంట నీరు తప్ప లాభం లేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, పంటలకు నీరందించడం లేదని మండిపడ్డారు. వరి పొలాలు ఎండిపోతుంటే రైతులు అరిగోస పడుతున్నారని, వారి పక్షాన మాట్లాడడం తప్పా ? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బక్క రామ్‌ప్రసాద్, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, చింతకింది మురళి, బీఆర్ఎస్ నాయకులు పత్తి వెంకటేశ్, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, కుండె సంపత్, సారాబు సంతోష్, బీజని మధు, ఆలేటి అజయ్, ఎండీ ఫయాజ్, విజయ్, జల్లి నర్సింహులు, పూల శ్రవణ్, టింకు, దయ్యాల సంపత్, శ్రీకాంత్, పాశికంటి శ్రీనివాస్, జూకంటి పెద్ద ఉప్పల్లయ్య, చిన్న ఉప్పల్లయ్య, బింగి రవి, భాను, రచ్చ రామనర్సయ్య పాల్గొన్నారు.