మోతె, డిసెంబర్ 13 : బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మంద ఉపేందర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పొందిన బీమా వచ్చింది. ఉపేందర్ భార్య మంద ఉమారాణిని వారి ఇంటి వద్దకు వెళ్లి శుక్రవారం రూ.2 లక్షల బీమా చెక్కును మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించి రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తున్నదన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలెవరైనా ప్రమాదవశాత్తు మృతిచెందినట్లయితే నామినికి రూ.రెండు లక్షల బీమా చెక్కును పార్టీ అందజేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు ఏలూరి వెంకటేశ్వర్రావు, మండల ప్రధాన కార్యదర్శి మధు సూదన్‌రెడ్డి, మిక్కిలినేని సతీశ్, నవిల, రామ్‌కోటి, వెంకట్‌రెడ్డి, కోటేశ్వర్రావు, మాజీ సర్పంచులు, గుండాల గంగులు, గాంధీ, వాసంశెట్టి రమేశ్, శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, కోటిలింగం, బాబు, రామకృష్ణ, శ్రీను, వెంకటరెడ్డి, శ్రీనివాస్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, భిక్షం, కృష్ణారెడ్డి, ఉమేశ్, వెంకయ్య పాల్గొన్నారు.