అర్వపల్లి, ఆగస్టు 28 : అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో వాటర్ షెడ్ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ, జడ్పీ సీఈఓ వి.వి అప్పారావు గురువారం పరిశీలించారు. నీటి నిల్వ చేయు పనులను పరిశీలించి, వాటర్ షెడ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అయన వెంట ఎంపీడీఓ గోపి, ఏపీఓ ఉపేందర్, ఈసీ నగేశ్, కార్యదర్శి రమేశ్, లింగయ్య ఉన్నారు.