యాప్లతోయాతన!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రైతులను యాప్ కష్టాలు వేధిస్తున్నాయి. కిసాన్ కపాస్ యాప్, యూరి యా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, ఇప్పుడు కొత్తగా యూరియా ఫర్టిలైజర్ యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. సంబురంగా సాగు చేసుకోవాల్సిన రైతు లు ఇప్పుడు యాప్‌లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
- కిసాన్ కపాస్, యూరియా ఫర్టిలైజర్ బుకింగ్‌లకు తోడు.. కొత్తగా యూరియా ఫర్టిలైజర్ యాప్
- సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6.20 లక్షల ఎకరాల్లో పంట సాగు
- రైతులకు 56.270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం
- విడతల వారీగా అందనున్న యూరియా
- మళ్లీ యూరియా కష్టాలు ఎదురైతే సాగు కష్టమే అంటున్న రైతులు
తిరుమలగిరి, జూన్ 22 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రైతులను యాప్ కష్టాలు వేధిస్తున్నాయి. కిసాన్ కపాస్ యాప్, యూరి యా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, ఇప్పుడు కొత్తగా యూరియా ఫర్టిలైజర్ యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. సంబురంగా సాగు చేసుకోవాల్సిన రైతు లు ఇప్పుడు యాప్‌లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీని కోసం ప్రత్యేకంగా పెద్ద సెల్ఫోన్లు కొనాల్సి వస్తోంది. బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రైతులకు సీజన్ కంటే ముందే రైతు బంధు, ఎరువులు, విత్తనాలు అందించటంతో సంబురంగా సాగు చేసుకున్నారు.
ప్రస్తుతం పంటల సాగుకు ఈ వానకాలం సీజన్లో కూడా యాప్ ద్వారానే యూరియా పంపిణీ చేయనున్నారు. యూరియా కొరత కారణంగా గత యాసంగి సీజన్లోనూ ఫర్టిలైజర్ యూప్ పేరుతో రైతులకు సరఫరా చేశా రు. ఈ యాప్‌తోనే వానకాలం సీజన్లో పం టలకు యూరియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో యూరి యా నిల్వలను పెంచి, గురువారం నుంచి యూరియాను అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాలు , పీఏసీఎస్‌ల్లోనూ ఈ విధానాన్నే అమలు చేయనున్నారు. దీంతో రైతులు అధికంగా యూరియా వాడకుండా, పక్కదారి పట్టకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. యాసంగిలో యూరియా కొసం రైతులు అవస్థలు పడ్డారు. ఈ సారైనా సక్రమంగా యూరియా అందుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు.
యుద్ధం వల్లే యూరియా కొరత..
యుద్ధం కారణంగా యూరియా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున వరిసాగు చేయటంతో దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైంది. దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినా తర్వాత యుద్ధం కారణంగా కొరత ఏర్పడింది. దీనితో సాగుకు సరిపడా యూరియా లేక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
6.20 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 6.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 4.94 లక్షల ఎకరాలు,90 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. రైతులు యూరియా వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 56.270 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అవసరం పడనుంది.
రైతులకు సూచనలు..
యారియా యాప్ గురువారంతో ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యూరి యా కోసం వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
- యూరియా బుక్ చేసుకోవాలంటే రైతులు మొదట ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
- పట్టాదారు పాస్‌బుక్, ఫోన్ నెంబర్ లింక్ చేయాలి.
- యూరియా యాప్‌లో ఇబ్బందులు తలెత్తినా, బుకింగ్ ఓపెన్ కాకపోయినా వెంటనే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి, దరఖాస్తు చేసుకుంటే యాప్ ఓపెన్ చేస్తారు.
- యాప్‌తో ఇబ్బందులు ఎదురైన రైతులు పట్టాదారు పాసుపుస్తకంతో పాటు, ఆధార్ కార్డుతో లింకైన ఫోన్ నంబర్ తీసుకోని రావాలి.
- గురువారం నుంచి యూరియా స్టాక్ ఉన్న పీఏసీఎస్‌ల్లో అనుమతి ఉన్న ఎరువుల దుకాణాల్లో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
యాప్‌ల గురించి మాకేం తెలుస్తది..
యాప్‌ల గురించి మాకేం తెలుసు. సాగు వదిలి ఏదో యాప్‌లో బుక్ చేస్తే యూరియా వస్తదని అంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప.. బాగుచేసే ఆలోచన లేదు. మాకు చదువు రాదు.. ఏదో డబ్బా సెల్లులు ఉన్నాయి. మళ్లీ యాప్ కోసం మేం పెద్ద సెల్ఫోన్లు కొనాలే.. దానికి 6-7 వేలు ఖర్చు చేయాలి. లేకుంటే ఎవరినైనా బతిమిలాడాలి. ప్రతీ సీజన్లో ఏదో ఒక బాధ పెడుతున్నారు. రైతులకు యూరియా అందించేది పోయి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయటం మంచిది కాదు.
-కాలూరాం నాయక్, రైతు, తిరుమలగిరి
సాగు చేయాలా.. దుకాణాల చుట్టూ తిరగాలా..
రైతులు వ్యవసాయం చేసుకోవాలా ? లేక ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరగాలో అర్థం కావటం లేదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు. అన్ని కష్టాలూ రైతులకే. వ్యవసాయ చేయాలా వదిలేయాలా ప్రభుత్వమే చెప్పాలి. యా సంగిలో యూరియా కోసం అరిగోస పడ్డం. అన్నం..నీళ్లు లేక అవస్థలు పడ్డం. మళ్లీ ఇప్పుడు అదే బాధ పెడితే రైతులు చావాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో హాయిగా ఉన్నాం. గీ కష్టాలు లేవు. ఇప్పుడు రోజుకో రూల్ పెడుతున్నారు.
-దేవేందర్, రైతు నెల్లిబండ, తిరుమలగిరి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

