వేములపల్లి, నవంబర్ 4 : రాబోయే ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్‌రావును మరోమారు అత్యధిక మెజార్టీతో గెలిపించి, నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు ప్రతి గ్రామానికి రోడ్డు వసతి, సాగు నీటికోసం లిఫ్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే భాస్కర్‌రావును భారీ మెజార్టీతో గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు మేలు కలుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, కేసీఆర్ మూడుసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు.