భువనగిరి సిటీ, మార్చి 20 : సడెన్ కార్డియో అరెస్ట్ అయిన వ్యక్తికి తక్షణమే అందించే కార్డియో పల్మనరీ రిససీటేషన్ (సీపీఆర్)పై భువనగిరి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ హాజరయ్యారు.
ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బందికి డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు, డాక్టర్లు కాటంరాజు, విజయ్‌కుమార్, హేమంత్‌కుమార్, అశ్వినికుమార్ శిక్షణ ఇచ్చారు.